Sunday, 13 November 2011

నిన్నే కలిసా....

నిన్నే కలిసా నను నే మరిచా నీ ఊపిరి నే అయిపోయా...
నీ నీడ గా మారి వెన్నంటే వున్నాను ఒక్కసారి చూడలేవా...

ఓ మోనా, న ప్రియ సఖా...

ఇంద్రదన్నస్సుని ఊయల గా చేసి నీకే జోలలు పాడనా...
తారలనే పువ్వులుగా మర్చి ప్రతిరోజు నిను అర్చించనా...
ఆ సూర్యుడినే నేలరేడుని చేసి మరో జాబిలిని అందివ్వనా ...

ఏమివ్వగలను నీకు కానుకగా....

కోహినూర్ వజ్రాన్నే తెచ్చా నీకోసం... కోటి కాంతుల నీ వజ్రం ముందు అది చిన్నబోయింది...
చిలుకమ్మ ని తీసుకొచ్చా నీకు కబుర్లు చెబుతుందని... నీ మృదుమధుర వాణి చూసి ఎగిరిపోయింది...
చిన్ని హంసనే ఇచ్చానే చిరు కానుకగా... నీ నడకలోని హొయలు చూసి వెలవెలబోయింది....

నా హృదయాన్నే బహుమతిగా ఇస్తున్నా స్వీకరించు నా మోనా...
నా ప్రాణం నీవని చెప్పకనే చెబుతున్నా.... ఆలకించు నా మోనా....

No comments:

Post a Comment