ఓ ప్రియా .... ఒంటరిని చెయ్యకు ప్రేమా ఓ ప్రేమా.... నను విడిచి వెళ్ళకే .... నీవే లేక మనసు శిలగా మారెనే... ప్రేమించడం నే చేసిన నేరమా... పూజించడం తొలి పాపమా... సాగరమునై ఒంటరిగా నేనుంటే.... అలవై ఎద లయవై నాలో చేరావు..! మౌనమే మాటగా నే జీవిస్తుంటే ... భాషగా నా పెదవిపై పలుకుగా మారావు! అన్నీ చేసి ప్రేమ ఎడారిలో ఒంటరిగా వదిలావు... ఎండమావి లా అనుక్షణం నను వేదిస్తున్నావు నీరెండిన సరసులా మదిలో మంటతో రగులుతుంటే చినుకు తడివై చిన్ని మనసుకి నీ ప్రేమని పంచావు..! శిశిరం లో అరణ్యం లా నే జీవిస్తుంటే.. ఆమని లా చేరి ప్రేమ చిగురించేలా చేసావు...! అలాగే ప్రేమగా నన్ను సుడిగుండంలో తోసావు.... నా చిన్ని గుండెలో ఎన్నటికి ఆరని అగ్నిని రగిల్చావు. |
Sunday, 13 November 2011
ఓ ప్రియా ....
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment