Sunday 13 November 2011

నిన్నే కలిసా....

నిన్నే కలిసా నను నే మరిచా నీ ఊపిరి నే అయిపోయా...
నీ నీడ గా మారి వెన్నంటే వున్నాను ఒక్కసారి చూడలేవా...

ఓ మోనా, న ప్రియ సఖా...

ఇంద్రదన్నస్సుని ఊయల గా చేసి నీకే జోలలు పాడనా...
తారలనే పువ్వులుగా మర్చి ప్రతిరోజు నిను అర్చించనా...
ఆ సూర్యుడినే నేలరేడుని చేసి మరో జాబిలిని అందివ్వనా ...

ఏమివ్వగలను నీకు కానుకగా....

కోహినూర్ వజ్రాన్నే తెచ్చా నీకోసం... కోటి కాంతుల నీ వజ్రం ముందు అది చిన్నబోయింది...
చిలుకమ్మ ని తీసుకొచ్చా నీకు కబుర్లు చెబుతుందని... నీ మృదుమధుర వాణి చూసి ఎగిరిపోయింది...
చిన్ని హంసనే ఇచ్చానే చిరు కానుకగా... నీ నడకలోని హొయలు చూసి వెలవెలబోయింది....

నా హృదయాన్నే బహుమతిగా ఇస్తున్నా స్వీకరించు నా మోనా...
నా ప్రాణం నీవని చెప్పకనే చెబుతున్నా.... ఆలకించు నా మోనా....

ప్రేమకోసం...

ప్రేమకోసం నీ దరికి నే ప్రేమగా వస్తే
పేలవంగా చూస్తావు ప్రేమే లేనట్టుగా
భరించలేక నె బాదతో.. దూరంగా వెలితే...
నన్ననుసరించి పలకరిస్తావు ప్రేమగా...

నువు ప్రేమించలేనప్పుడు కనీసము నను ద్వేషించు...
ద్వేషించలేనప్పుడు నను ప్రేమించు
ప్రేమించక, ద్వేషించక హింసించకు నా ఈ హృదయాన్ని...

ఓ ప్రియా ....


ఓ ప్రియా .... ఒంటరిని చెయ్యకు

ప్రేమా ఓ ప్రేమా.... నను విడిచి వెళ్ళకే ....
నీవే లేక మనసు శిలగా మారెనే...
ప్రేమించడం నే చేసిన నేరమా...
పూజించడం తొలి పాపమా...


సాగరమునై ఒంటరిగా నేనుంటే....
అలవై ఎద లయవై నాలో చేరావు..!


మౌనమే మాటగా నే జీవిస్తుంటే ...
భాషగా నా పెదవిపై పలుకుగా మారావు!


అన్నీ చేసి ప్రేమ ఎడారిలో ఒంటరిగా వదిలావు...
ఎండమావి లా అనుక్షణం నను వేదిస్తున్నావు


నీరెండిన సరసులా మదిలో మంటతో రగులుతుంటే
చినుకు తడివై చిన్ని మనసుకి నీ ప్రేమని పంచావు..!


శిశిరం లో అరణ్యం లా నే జీవిస్తుంటే..
ఆమని లా చేరి ప్రేమ చిగురించేలా చేసావు...!


అలాగే ప్రేమగా నన్ను సుడిగుండంలో తోసావు....
నా చిన్ని గుండెలో ఎన్నటికి ఆరని అగ్నిని రగిల్చావు.

నేస్తమా

రావేల ఓ నేస్తమా
నన్ను విడలేని బంధమా
నా హృదయమా
నా మధుర గీతమా

విధి శాపమై చెలికాడా
నిను నన్ను వేరు చేసేను
కధ కలగా మిగిలింది
బ్రతుకు వ్యధయై నిలిచింది
మన లేను నేను
నువ్వు లేని ఈ జగాన

నా నీడ లో నీడ
నువ్వు వస్తావని ఎదురుచూసింది
నీలి మేఘాల చాటున
నీవు కనిపిస్తావని వెతికి వేసారింది
నిశి రాత్రులెన్నో
నీ తలపులతో గడిపాను
నీ రాక కోసమే
నా ఆత్మ వేచెను..